వందే భారత్ లో బేరసారాలు.. రూ.380కే టికెట్, టీటీఈ సస్పెండ్.. వీడియో ఇదిగో!
- వందే భారత్ లో తక్కువ ధరకు టికెట్ ఇస్తానన్న టీటీఈ
- ప్రయాణికుడితో బేరసారాలను వీడియో తీసి పోస్ట్ చేసిన ప్యాసింజర్
- రూ.700 టికెట్ ను రూ.380కి ఇస్తానని ఆఫర్
- సోషల్ మీడియాలో వీడియో వైరల్.. టీటీఈపై సస్పెన్షన్ వేటు
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడికి తక్కువ ధరకే టికెట్ ఇస్తానని చెప్పిన ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)పై భారతీయ రైల్వే శాఖ వేటు వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు అతడిని సస్పెండ్ చేశారు.
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఈ వీడియోలో.. టీటీఈ ఓ ప్రయాణికుడితో టికెట్ గురించి మాట్లాడుతున్న దృశ్యాలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఇది కుదరదని చెబుతూనే రూ.380 చెల్లిస్తే తాను టికెట్ ఏర్పాటు చేస్తానని ఆ టీటీఈ చెప్పడం వినిపిస్తోంది. అదే టికెట్‌ను అధికారికంగా కొనుగోలు చేస్తే సుమారు రూ.700 అవుతుందని ఆయన వివరించారు. ఈ సంభాషణ మొత్తాన్ని ప్రయాణికుడు రహస్యంగా రికార్డు చేశారు.
అనంతరం, 'రూ.750 విలువైన వందే భారత్ టికెట్‌ను టీటీఈ రూ.380కే ఇస్తున్నాడు' అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వేగంగా వ్యాపించింది. ఈ వీడియోపై రైల్వే సేవ, డీఆర్ఎం దానాపూర్ స్పందించాయి. ఘటనను తీవ్రంగా పరిగణించిన రైల్వే అధికారులు.. విచారణకు ఆదేశించి, తక్షణమే ఆ టీటీఈని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ ఘటనపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది అవినీతి అని, అధికారుల హోదాను దుర్వినియోగం చేయడమేనని విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం.. ప్రయాణికుడికి సహాయం చేసేందుకే టీటీఈ అలా చేసి ఉండొచ్చని సరదాగా కామెంట్లు పెడుతున్నారు.